గుంటూరు వెస్ట్: గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఫ్యాక్షనిస్టులా, రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం దారుణమని మేయర్ కావటి మనోహర్‌నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం మేయర్‌తోపాటు, డెప్యూటీ మేమర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), కార్పొరేటర్లు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో కలిశారు. కమిషనర్ వ్యవహారశైలిపై ఫిర్యాదుచేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఈనెల 4న జరిగిన కౌన్సిల్ సమావేశంలో దూకుడుగా వ్యవహరించిన కమిషనర్ ఆ తరువాత కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తన వద్ద ఉన్న సిబ్బందిని, అటెండర్లను, కార్యాలయ సిబ్బందిని కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించారని విమర్శించారు.
వరద సాయంపై పూర్తి విచారణ చేపట్టాలి
డెప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ విజయవాడ వరద ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం నగర పాలక సంస్థ ఖర్చుచేసిన నిధులపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మేయర్, డెప్యూటీ మేయర్లకు కేటాయించిన సిబ్బందిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ తొలగించడం సరికాదని పేర్కొన్నారు.
మేయర్ కావటి మనోహర్‌నాయుడు ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment