పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటే దేశం మొత్తం సుందరంగా ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జేసీతోపాటు అధికారులు చీపురుపట్టి కలెక్టరేట్ ప్రాంగణంలోని చెత్తా చెదారాలను ఊడ్చి శుభ్రం చేశారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన ఽథీమ్‌తో 12 నెలలు కొనసాగుతుందని తెలిపారు. ప్రపంచం మారుతోందని, దీనికి తగ్గట్లు మనం కూడా ముందుకు సాగాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ శుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. చెత్తా చెదారాలు రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వేయొద్దని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీఎస్‌ఓ కోమలి పద్మ, డీపీఓ నాగ సాయి కుమార్, ఐసీడీఎస్ ఉమాదేవి, సీపీఓ శేషక్ష, జిల్లా రిజిస్ట్రార్ డి.శైలజ, జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జేసీ భార్గవ్ తేజ
Comments
Please login to add a commentAdd a comment