దేహదారుఢ్య పరీక్షల్లో 312 మంది అర్హత
నగరంపాలెం: కానిస్టేబుళ్ల అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. నగరంపాలెం పోలీస్ పరేడ్ మైదానంలో కొనసాగుతున్న దేహ దారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థుల ఛాతీ, ఎత్తు కొలతలు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, పరుగు పందెం పోటీల నిర్వహణను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. 529 మంది అభ్యర్థుల్లో 95 మంది ధ్రువపత్రాలు తేవకపోవడంతో వెనుదిరిగారు. 434 మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 312 మంది అర్హత సాధించారు. 43 మందిని ఛాతీ, ఎత్తు కొలతలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. మిగతా 391 మందికి 1600 మీటర్ల పరుగు పందెం పోటీలు జరగ్గా, 70 మంది అనర్హులుగా ప్రకటించారు. 321 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీల్లో 170 మంది అర్హత సాధించారు. 319 మందికి లాంగ్ జంప్ పోటీలు చేపట్టగా, వారిలో 311 మంది అర్హత సాధించారు. జిల్లా ఏఎస్పీలు ఏవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్) పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment