● గుంటూరు నగరం పాత గుంటూరు ప్రాంతానికి చెందిన శ్రీను అనే యువకుడు నిత్యం ఫేస్‌బుక్ అధికంగా చూస్తుంటాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌లో యువతి పరిచయమైంది. తనది ఏలూరని..అక్కడకు రావాలని చెప్పడంతో ఆమెను కలిసేందుకు వెళ్లాడు. తన మొబైల్‌కు లోకేషన్ పెట్టింది. తీరా చూస్తే ఆ ప్రాంతమంతా ఊరికి చివరన ఉంది.అక్కడకు వెళ్లిన శ్రీను దగ్గరకు కొందరు వ్యక్తులు వచ్చి.. తమ ఆడపిల్లలకు మేసేజ్‌లు చేస్తావా? అంటూ బెదిరించి ఉన్న డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు.
● అరండల్‌పేటకు చెందిన ఒక యువతి ఇన్‌స్ట్రాగామ్‌ను అధికంగా ఉద్యోగవకాశాల కోసం చూస్తుంటుంది. దీనిని ఆసరా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమెకు మాయమాటలు చెప్పారు. ఉద్యోగం ఆర్డర్ కాపీ కూడా నకిలీది పంపి, రూ 6లక్షల వరకు దోచుకున్నారు.
వ్యక్తిగత గోప్యతకు పెను సవాలుగా మారిన స్మార్ట్ ఫోన్ల వినియోగం కొంప ముంచుతున్న డిజిటల్ సైకాలజీ చూసే వీడియోలు, చేసే పోస్టులతో వినియోగదారుల మానసికస్థితి అంచనా ఖాతాదారుల యూఆర్‌ఎల్స్ అమ్మేస్తున్న బ్లాగర్స్ సమాచారంతోనే రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment