ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: గుంటూరులోని ఏపీ ఎన్జీఓ హోమ్‌లో మంగళవారం ఏపీ ఎన్జీవో జిల్లా మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా మహిళా విభాగం చైర్‌పర్సన్ రాధారాణి మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వాటిని జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళతామన్నారు. కన్వీనర్ లక్ష్మీరమ్య మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు కార్యాలయంలో కనీస సదుపాయాలు లేవని చెప్పారు. కొన్ని కార్యాలయాలలో నేటికీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లు ఏర్పాటు చేయలేదని, వాటన్నిటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. నూతన సంవత్సర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమెన్ వింగ్ గుంటూరు జిల్లా క్యాలెండరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమెన్ వింగ్ కన్వీనర్ ఎం.రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఉమెన్ వింగ్ కన్వీనర్ పి.మాధవి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉమెన్ కె.శివ జ్యోతి, గుంటూరు సిటీ అధ్యక్షుడు సూరి, సెక్రటరీ చింతల కళ్యాణ్ కుమార్, ప్రత్తిపాడు ప్రెసిడెంట్ అనిల్, జిల్లా ఉమెన్ వింగ్ కోశాధికారి శ్రీవాణి, కో చైర్ పర్సన్ అంజలి, కో–కన్వీనర్ శైలజ, సిటి ఉమెన్ వింగ్ చైర్‌పర్సన్ లక్ష్మీ ప్రసన్న, కన్వీనర్ విజయలక్ష్మి, జిల్లా, సిటి ఉమెన్ వింగ్ కార్యవర్గ సభ్యులు, తాలూకా ఉమెన్ వింగ్ చైర్ పర్శన్, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ఎన్జీఓ మహిళా ఉద్యోగుల సమావేశం
Comments
Please login to add a commentAdd a comment