ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
● రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి
కొండా సురేఖ
● ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో వినతుల స్వీకరణ
కాశిబుగ్గ: ప్రజా సమస్యల పరిష్కారానికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ పరమావధి అన్నారు. ప్రజల కోసం తూర్పులో హైదరాబాద్‌లో ప్రతీ నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరైనా ఎప్పుడైనా తనని కలవొచ్చని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖను 19వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి రాజేశ్ కలిసి ఓ సిటీలోని శ్రీసీతారామాంజనేయ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం చేయనున్నట్లు అందుకు ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు చేయాలని కోరారు. టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం సభ్యులు మంత్రిని కలిసి మార్కెట్ సమస్యలు తెలిపారు. అనంతరం వారు మంత్రి సురేఖను సన్మానించారు. జిల్లా తాపీ మేసీ్త్రల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. మంత్రిని కలిసిన వారిలో పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment