కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీలో ఇటీవల దావ కిశోర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు చిన్న ఆధారంగా కూపిలాగిన పోలీసులు చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కిశోర్ భార్య ఆసుపత్రికి వెళ్లగా కిశోర్ పిల్లలను ట్యూషన్ నుంచి తీసుకురావడం కోసం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. దీనిని గమనించిన హైదరాబాద్‌కు చెందిన సనాబేగం, సోహెల్ తాళం పగులగొట్టి 23 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు. ఆ సమయంలో సీసీ కెమెరాలో రికార్డు అయిన ఓ వీడియోలో ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో కూడిన ఓ కారును పోలీసులు గుర్తించారు. అనుమానం కలగడంతో ఆ వాహన కదలికలపై నిఘా వేశారు. సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్ కుమార్, లవన్‌కుమార్, సిబ్బంది భాస్కర్, విష్ణు.. ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి దర్గా కాజీపేటలో సంచరిస్తున్న నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి 23 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, చిన్న ఆధారంగా చోరీ కేసును చేధించి నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చిన పోలీసులను సీపీ అంబర్ కిశోర్ ఝాతో పాటు అధికారులు అభినందించారు.
చిన్న ఆధారంతో కూపిలాగిన పోలీసులు
ఇద్దరి అరెస్ట్, రిమాండ్..
23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment