సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
● టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి
విద్యారణ్యపురి: సమగ్రశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని, ఇప్పటికై నా ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 6,7 తేదీల్లో జిల్లాకేంద్రంలో నిర్వహించబోతున్న రిలే నిరసన దీక్షలు, ఈ నెల 9నుంచి చేపట్టబోయే నిరవధిక సమ్మెకు తమ సంఘం మద్దతు తెలుపుతుందన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. సమావేశంలో సంఘం రాష్ట్రకార్యదర్శి రావుల రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘపతి, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రగిరి లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి గొడిశాల రమేశ్, బాధ్యులు ఇప్పకాయల కుమారస్వామి, ఎన్. అన్నారెడ్డి, మహ్మద్ అబ్జల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment