రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య
● కారులో మృతదేహాన్ని రంగంపేటలో వదిలివెళ్లిన నిందితులు
● ఆర్థిక లావాదేవీలే కారణమా?
రామన్నపేట : వరంగల్ కాశిబుగ్గకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి వెలిగేటి రాజమోహన్(62) దా రుణ హత్యకు గురయ్యారు. రాజమోహన్‌ను ఎక్క డ హత్య చేశారో.. ఏ కారణం చేత హత్య చేశారో తెలియదు కానీ.. అతడి కాళ్లను గొలుసులతో, చే తులను తాళ్లతో కట్టేసి తలపై తీవ్రంగా కొట్టి చంపారు. అతడి కారులోనే మృతదేహాన్ని పడేసి మంగళవారం ఉదయం 3.42 గంటల ప్రాంతంలో మట్టెవాడ పీఎస్ పరిధిలోని రంగంపేట ప్రాంతంలో ఓ వ్యక్తి వదిలేసి వెళ్లాడు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు కారులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి కారు వదిలేసి వెళ్లిన విషయం గుర్తించారు. అనంతరం మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తి చేశారు.
హనుమకొండలో నివాసం..
రాజమోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం హనుమకొండ శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. మృతుడి సోదరుడు రాజగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రాజమోహన్ హత్యకు భూ తగాదాలు లేదా వివాహేత సంబంధాల కారణమా, ఆర్థిక కారణాలా అనే విషయం తెలియాల్సి ఉంది.
సోమవారం రాత్రి ఫోన్ స్విచ్చాఫ్
రాజమోహన్ సోమవారం సాయంత్రం నుంచి ఫోన్‌లో స్పందించకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళన చెందారు. రాత్రి 11 గంటల వరకు కాల్ చేసినా స్పందించలేదు. రాత్రి 11 గంటల తరువాత ఫో న్ స్విచ్చాఫ్ అయ్యింది. ఈ క్రమంలో కుటుంబీకులు మంగళవారం ఉద యం సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసే క్రమంలో రంగంపేటలో మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment