భగవద్గీత సారం.. నిత్యం ఆచరణీయం
వరంగల్: భగవద్గీత శ్లోక పఠనం కుల, మత భేదాలు లేకుండా ప్రతిఒక్కరూ ప్రతినిత్యం పాటించాలని, దాని సారాంశాన్ని జీవన విధానంలో ఆచరించేలా మనస్ఫూర్తిగా ప్రయత్నించాలని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ అన్నారు. కందుకూరి శివానందమూర్తి 96వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం జిల్లా స్థాయి భగవద్గీత పోటీలను సప్తధామంలో నిర్వహించారు. పోటీల్లో 100 మంది విద్యార్థులు పాల్గొనగా, విజేతలకు ప్రథమ బహుమతి రూ.5116లు, ద్వితీయ బహుమతి రూ.3116లు, తృతీయ బహుమతి రూ.1116 నగదు అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెద్ద ప్రభాకర్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment