యూనియన్ బలోపేతానికి పాటుపడాలి
హన్మకొండ: యూనియన్ బలోపేతానికి జిల్లా కమిటీలు పాటుపడాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ) –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ సూచించారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని యూనియన్ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో టీఎస్‌ఈఈయూ –327 ఎన్పీడీసీఎల్ కంపెనీ స్థాయి సర్వసభ్య సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ యూనియన్ సభ్యత్వాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనియన్‌లో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని తేల్చిచెప్పారు. జిల్లా కమిటీలు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. 70 ఏళ్లుగా విద్యుత్ ఉద్యోగులకు యూనియన్ అండగా నిలుస్తూ హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని వివరించారు. అనంతరం టీఎస్‌ఈఈయూ –327 ఎన్పీడీసీఎల్ కంపెనీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.మహేందర్ రెడ్డి, కార్యదర్శిగా కె.శ్రీనివాస్ మరోసారి ఎన్నికయ్యారు. సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంఎస్‌ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.గంగాధర్, వైస్ ప్రెసిడెంట్లుగా పి.భాస్కర్, ఎండీ.రహమత్ అలీ, కె.రాజేష్, ఎం.అమరావతి, ఎ.సుధాకర్, వి.శ్రీనివాస్, ఎస్.సంధ్య, పి.త్రినాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వై.లక్ష్మయ్య, సీహెచ్.బాబు, ఎన్.వెంకన్న, జి.రవి, ఎండీ.రియాజ్, ఎన్.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పాక శ్రీనివాస్, బి.ప్రశాంత్ రెడ్డి ఎండీ.అలీమ్, డి.కోటి, కోశాధికారి కట్ల సదయ్య, కార్యాలయం కార్యదర్శిగా వి.సునీల్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా యూనియన్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్ వ్యవహరించారు.
ఇద్దరు పిల్లలు ఉన్నారని..
మహబూబాబాద్ రూరల్: ఇటీవల సంచలనం సృష్టించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో హత్యచేసి పూడ్చిపెట్టిన నాగమణి హత్యకేసు విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పోలీసు శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కోసం గాలిస్తున్నారు. గోపిని వివాహం చేసుకోవడానికి ముందే మృతురాలు నాగమణికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు పిల్లలున్న నాగమణిని గోపి వివాహం చేసుకోవడం ఇష్టంలేని అత్తామామలు రాములు, లక్ష్మి, ఆడపడుచు దుర్గ తరచూ ఆమెతో గొడవపడేవారని సమాచారం. ఈ క్రమంలోనే నెలన్నర క్రితం గోపి, నాగమణి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఆమె ముఖంపై గాయమైంది. మహబూబాబాద్ టౌన్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. రోజూ ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉందేది. గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి పది రోజుల క్రితం నాగమణితో గోపి గొడవపడగా అత్తమామలు రాములు, లక్ష్మి, ఆడపడుచు దుర్గ కలిసి ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలు స్తోంది. నాగమణికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఎలా గైనా సరే ఆమెను వదిలించుకోవాలని కడతేర్చి, గొ య్యితీసి కప్పిపెట్టినట్లు సమాచారం. ఈ సంఘటన కు దుర్గ భర్త మహేందర్ సహకరించడా లేదా అనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది.
● టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర
సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment