కొనసాగుతున్న అన్నారం దర్గా ఉర్సు
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లోని యాకూబ్ షావలి దర్గాలో రెండో రోజు ఉర్సు ఉత్సవాల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున గంధం సమర్పణ అనంతరం సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీపారాధన కార్యక్రమం అనంతరం భక్తులు అధిక పాల్గొని యాకుబ్‌బాబా దర్గాతోపాటు గుంషావళి, బోలెషావళి, మహబూబియా, చిల్లాలను దర్శించుకున్నారు.
అన్నారం దర్గాను అభివృద్ధి చేస్తా..
రాష్ట్రంలో అతి పెద్ద దర్గా అయిన అన్నారం దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మత్ ఉల్లాహుస్సేన్ అన్నారు. శుక్రవారం దీపారాధన కార్యక్రమంలో భాగంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా అన్నారం దర్గాను అభివృద్ధి చేస్తానని, ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అన్నారం దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినప్పటికీ గత పాలకులు విస్మరించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దర్గాలకు నిధుల ఢోకా లేదని తెలిపారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, గొడుగు భిక్షపతి, సారంగపాణి, కందికట్ల అనిల్, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్, ముజావర్లు గౌస్‌పాషా, యాకుబ్‌పాషా, ఖాజాపాషా, షాబీర్‌పాషా, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. దర్గా ఆవరణలో వక్ఫ్‌బోర్డు సమక్షంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానాన్ని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్ ప్రారంభించారు. సుమారు 2000 మంది అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు.
దర్శించుకున్న ఎర్రబెల్లి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ మనోజ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు షబ్బీర్‌అలీ, రాజు, మాజీ సర్పంచ్‌లు కృష్ణ, శ్రీనివాస్, సంతోశ్, యాకయ్య, మనోహర్, పాషా పాల్గొన్నారు.
యాకూబ్‌బాబాను
దర్శించుకున్న వేలాదిమంది
ఘనంగా దీపారాధన
Comments
Please login to add a commentAdd a comment