నేడు బీసీ రాజకీయ యుద్ధభేరి
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బీసీ రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ జరగనుంది. ఆధిపత్యకులాలు బీసీలను కేవలం ఓటర్లుగానే వినియోగించుకుంటున్నాయని, అందుకే బీసీలు చైతన్యవంతులై రాజ్యాధికారం దిశగా సాగాలంటే ఐక్యంగా ముందుకు సాగి తమ సత్తా చూపించాలనే నినాదంతో హలో బీసీ.. చలో వరంగల్ పేర బీసీ రాజకీయ యుద్ధభేరి సభ నిర్వహిస్తున్నారు. కాగా, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న, ‘కుడా‘ మాజీ చైర్మన్, బీసీ నేత సుందర్‌రాజుయాదవ్ కొద్దిరోజులుగా బీసీ రాజకీ య యుద్ధభేరి సభ విజయవంతానికి వివిధ జిల్లాలో విస్తృత ప్ర చారం చేశారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్న కేయూలో బీసీ విద్యార్థులు, బీసీ ఉద్యోగులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి బీసీలు ఎలా అన్యాయానికి గురవుతున్నారో వివరించి వారి మద్దతు కూడగట్టారు. అలాగే, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులను కూడా కలిసి సభకు తరలిరావాలని కోరారు. ఈ క్రమంలో శనివారం సుందర్‌రాజు యాదవ్ ఆధ్వర్యంలో కాజీపేట నుంచి వరంగల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీ ల ఇంటలెక్చువల్ ఫోరం కూడా సభకు బీసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రచారం చేస్తోంది.
సభకు హాజరుకానున్న రాజకీయ ప్రముఖులు
బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు బీసీ కులస్తులను అధిక సంఖ్యంలో తరలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరుజిల్లాల నుంచి వాహనాలను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి కూడా బీసీ సంఘాల బాధ్యులు తరలిరానున్నారని సమాచారం. ఈ సభకు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్, తమిళనాడులోని డీఎంకే ఎంపీ విల్సన్, బిహార్‌లోని ఆర్‌జేడీ పార్టీ ఎంపీ మిసాభారతియాదవ్, సమాజ్‌వాది పార్టీకి చెందిన ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ ధర్మేందర్ హాజరవుతారని నిర్వాహకుడు సుందర్‌రాజుయాదవ్ తెలిపారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
గ్రౌండ్‌లో నిర్వహణ
తరలిరానున్న వివిధ రాష్ట్రాలకు
చెందిన రాజకీయ ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment