ఎస్సార్‌లో వర్క్‌షాప్
హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం అన్నాసాగ రం శివారులోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ‘ఉన్నత విద్యలో జనరేటివ్ ఏఐ,ఇంటరాక్టివ్ ఇ–కంటెంట్’ అనే అంశంపై సదస్సు నిర ్వహించారు. ఈసమావేశానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజర్,న్యూఢిల్లీ ప్రొఫెసర్ కె. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నత విద్యలో కీలక సమగ్రతపై దృష్టిసారించిందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ మాట్లాడుతూ ఎస్సార్ యూనివర్సిటీ విద్యను ఆధునిక దృక్ఫథంతో నేర్పిస్తోందన్నారు. గంట పాటు నిర్వహించే తరగతిలో అధ్యాపకులు 10 నిమిషాలు భావాలు వివరించాలని, మిగతా 50 నిమిషాలు పరికల్పిత అ భ్యాసం, ప్రాక్టీస్ ఆధారిత కార్యకలాపాలకు కేటా యించాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ సుమన్, అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముగిసిన ఆంగ్ల ప్రయోగ పరీక్షలు
కాళోజీ సెంటర్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పలు కళాశాలల్లో పరీక్షల నిర్వహణను శనివారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 5,403 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉండగా.. 5,318 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ పేర్కొన్నారు.
నేడు ‘సకల కళా సాంస్కృతిక విభావరి’
నయీంనగర్: సీనియర్ కళాకారుల సేవా ట్రస్ట్ ఓరుగుల్లు ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సకల కళా సాంస్కృతిక విభావరి నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సీతాల రఘువేందర్ తెలిపారు. శనివా రం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రఘువేందర్ మాట్లాడుతూ.. ఈవి భావరిలో శాసీ్త్రయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద పాటలు, నృత్యాలు, ఆర్కెస్ట్రా, హాస్య లహరి, పౌరాణికం, మైమ్, మిమిక్రీ, మ్యా జిక్ షో, చిందు యక్షగానం, గొల్ల సుద్దులు, మంద మెచ్చుల, శారద కథలు, బోనాల కోలాటం ప్రదర్శనలుంయని తెలిపారు. కళాభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆలేటి శ్యాంసుందర్, పద్మజదేవి, మధుసూధన్, లక్ష్మీనారాయణ, రవికుమార్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment