సరైన ప్రణాళికతోనే పరిశోధన ముందుకు..
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్ : సరైన సిద్ధాంత గ్రంథ ప్రణాళికతోనే పరిశోధన ముందుకెళ్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహిస్తున్న పీహెచ్‌డీ కోర్సుల వర్క్ ముగింపు సమావేశంలో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్ధాంత గ్రంథ సమర్పణ మధ్యకాలాన్ని సరిగా విభజించుకోవాలన్నారు. పరిశోధకులు సెమినార్లు, కార్యశాలలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో విద్య కళాశాల డీన్ ప్రొఫెసర్ రాంనాఽథ్‌కిషన్, బీఓఎస్ చైర్మన్, నిట్ వ్యాయామ విభాగం ఆచార్యుడు రవికుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏటీబీ ప్రసాద్, ఆచార్య రమేశ్‌రెడ్డి, స్టాటిస్టిక్స్ విభాగం అధిపతి జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ ఓఎస్‌డీగా మల్లారెడ్డి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్‌డ్యూటీ (ఓఎస్‌డీ)గా మ్యాథ్స్‌విభాగం ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి నియమితులయ్యారు. వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అప్రూవల్ మేరకు రిజిస్ట్రార్ రాంచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. మల్లారెడ్డి సంవత్సరం పాటు ఓఎస్‌డీ పదవిలో కొనసాగు తారు. కేయూలో తొలిసారి ఓఎస్‌డీ పదవిలో ప్రొఫెసర్‌ను నియమించాలని కొద్దిరోజుల క్రితం నిర్వహిచిన కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయించిన విషయం విధితమే. మల్లారెడ్డి 2007లో మాథ్‌మెటిక్స్‌విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. అనంతరం ప్రొఫెసర్, సైన్స్ విభాగం డీన్, కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి, పరీక్షల నియంత్రణాధికారి, రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రేపు ఓఎస్‌డీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నికల నియమావళి అమలుకు సహకరించాలి
● హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
హన్మకొండ: ఎన్నికల నియమావళి అమలుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల శాసన మండలి నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఉంటే వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు పోలింగ్ కేంద్రాల జాబితాను, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందించారు. ఈపోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో ఆర్డీఓలు రమేశ్‌రాథోడ్, కె.నారాయణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈవీ.శ్రీనివాసరావు, కె.శ్యాంసుందర్, రజినీకాంత్, జి.ప్రభాకర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎం.మణి, నర్మెట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment