పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: జిల్లాలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 317 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో 2,754 వార్డులు, 2,754 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. పురుషుల ఓట్లు 1,88,047, మహిళల ఓట్లు 1,95,067, ఇతరులు 10 మంది ఉన్నారని చెప్పారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, హౌసింగ్ పీడీ గణపతి పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు
జిల్లాలో పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల కోడ్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 13 మండలాల పరిధిలో 2,304 మంది ఓటర్లకు 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదన వు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, పర్యవేక్షకుడు రంజిత్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎన్‌సీఆర్‌సీ బృందం
నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ (ఎన్‌సీఆర్‌సీ) వరంగల్, గ్రేటర్ వరంగల్ బృందం శనివారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగి నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్‌సీఆర్‌సీ ప్రతినిధులు చరణ్, రాణి, అజారుద్దీన్, రాహుల్, అనిత, ధనలక్ష్మి, శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment