కొత్త తరహాలో చైన్ స్నాచింగ్!
హసన్‌పర్తి: చైన్‌స్నాచర్లు గతంలో కాలినడన వెళ్లే మహిళల మెడలో నుంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వారు. ప్రస్తుతం కొత్త తరహాలో చైన్‌స్నానింగ్‌కు తెరలేపారు. ముఖ్యంగా కిరాణాషాపులు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆ షాపులో మహిళాలు కౌంటర్‌పై ఉండే సమయాన్ని ఎంచుకుంటూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలా హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
బైక్‌పై వచ్చి..
ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మహిళలు కౌంటర్‌పై ఉన్న షాపులోకి ఓ యువకుడు వచ్చి సరుకులు ఖరీదుకు ఉపక్రమిస్తున్నాడు. అవకాశం లభించగానే ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, చైన్‌ను లాక్కెళ్తున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల వద్ద గత నెల 13వ తేదీన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఓ యువకుడు షాపుకు వచ్చి సరుకులు ఖరీదుచేస్తూ అవకాశం కోసం చూసి షాపు నిర్వాహకురాలు శ్రీలత మెడలో ఉన్న మూడు తులాల పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అలాగే, ఇటీవల గోపాలపురం ప్రాంతంలో ఇదే విధంగా కిరాణా షాపుకు వచ్చి పెరుగు ప్యాకెట్ అడుగుతూ షాపు నిర్వాహకురాలి మెడలో నుంచి చైన్ లాగాడు. బాధితురాలు కేకలు వేయడంతో యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఆయా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. తాజాగా హనుకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని బాహుపేట క్రాస్ వద్ద ఓ కిరాణా షాపుకు వచ్చిన యువకుడు బిర్యానీ మసాల అడుగుతూ షాపు నిర్వాహకురాలు మెడలో నుంచి సుమారు నాలుగు తులాల చైన్ లాక్కెళ్లాడు.
సీసీ కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తం
షాపునకు వచ్చి చైన్ లాక్కెళ్తున్న యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈమేరకు బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. నిందితులను పట్టుకోవడానికి సివిల్, టాస్క్‌ఫోర్స్‌తోపాటు సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు.
మహిళా నిర్వాహకులు ఉన్న కిరాణాషాపులే టార్గెట్
ఇప్పటికీ మూడు ప్రాంతాల్లో చోరీలు
నిందితుల కోసం పోలీసుల గాలింపు
Comments
Please login to add a commentAdd a comment