నేడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సోమవా రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉద యం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రా రంభం కానుంది. నామినేషన్లను నల్లగొండ కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో స్వీకరించనున్నారు.
కలెక్టరేట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు..
ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలిస్తారు. 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉ న్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మార్చి 3వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటి కే నల్లగొండ కలెక్టరేట్ బయట వంద మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు..
నామినేషన్లు సమర్పించేందుకు వచ్చే అభ్యర్థుల సందేహాలను నివృతి చేసేందుకు నామినేషన్ల స్వీకరణ హాల్ ఎదుట హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ఫామ్ పూరించడంలో ఎలాంటి సందేహాలున్నా సిబ్బంది ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
నిబంధనలు ఇలా..
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు సమర్పించే వారు జనరల్ అభ్యర్థి అయితే రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి.
● ఎమ్మెల్సీకి పోటీ చేసే వ్యక్తి తెలంగాణలో జనరల్ ఓటరై ఉండాలి. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఎ మ్మెల్సీ ఓటు హక్కు లేకపోతే పోటీకి అనర్హుడు.
● నామినేషన్ సమర్పించే అభ్యర్థికి పది మంది ప్రపోజల్స్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. వారంతా వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఈ మూడు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరై ఉండాలి.
10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
నల్లగొండ కలెక్టరేట్‌లో ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment