కరెంట్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ మృతి
బచ్చన్నపేట : కరెంట్ షాక్‌తో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని పడమటికేశ్వాపూర్ శివారు గ్రామం జెయాల వద్ద జరిగింది. ఎస్సై ఎస్‌కే హమీద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ (48) వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. గ్రామంలో మల్బరీ సాగు చేస్తూ ఇక్కడే ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్బరీ తోటకు వాడే వాటర్ ఫ్రీజర్‌ను వాటర్ గన్‌తో శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలో కరెంట్ షాక్ తగిలి బాత్‌రూంలోనే మృతి చెందాడు. పనివాళ్లు వచ్చి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనంతారంలో మరొకరు..
మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతారంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దీపికారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ సలీం (57) శనివారం రాంసింగ్ తండాకు చెందిన శంకర్ ఇంట్లో మార్బుల్ బండల పని కోసం వెళ్లాడు. పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన ఆ ఇంటి కుటుంబీకులు హుటాహుటిన మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సలీం అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. మృతుడు భార్య మోదీన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబీకులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment