రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
చిల్పూరు/పాలకుర్తిటౌన్: చిల్పూరు మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగాల నాగరాజు (28) దుర్మరణం చెందాడు. ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు రాంగ్ రూట్‌లో ఘన్‌పూర్ వైపునకు వస్తూ ఢీకొన్నాడు. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదివారం తెలిపారు. కాగా, నాగరాజు మృతితో బమ్మెరలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే నాగరాజు మృతి చెందాడనే విషయం తెలియగానే కుటుంబీకులతోపాటు గ్రామస్తులు బోరును విలపించారు.
జనగామలో మరో యువకుడు..
జనగామ రూరల్: బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యవకుడు దుర్మర ణం చెందాడు. ఈ ఘటన జనగామలో చోటు చే సుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం రెడ్యానాయక్ తండా కు చెందిన ధారావత్ విజయ్ (35) హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివా రం ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని నె హ్రూ పార్కు సమీపం బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో విజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై చెన్నకేశవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌కి భార్య నీల, కుమారుడు, కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment