కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీగా జూవాలజీ విభాగం ప్రొఫెసర్ వై వెంకయ్య పదవీ కాలం గత నెల29నముగిసింది. ఐదురోజులు అవుతున్నా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా ఏ ప్రొఫెసర్‌ను నియమిస్తారానేది ఆసక్తికరంగా మారింది.ఒక వేళ ప్రొఫెసర్ వెంకయ్యనే కొనసాగించాలంటే మళ్లీ స్పోర్డ్స్‌బోర్డు సెక్రటరీగా వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి అప్రూవల్‌మేరకు రిజిస్ట్రార్ నియామక ఉత్తర్వులు జారీచేయాల్సింది. వెంకయ్య పదవి కాలం గత నెల 29నే పూర్తికావడంతో స్పోర్ట్స్‌బోర్డులో బాధ్యతలను నిర్వర్తించడంలేదు. విషయాన్ని అప్పటి రిజిస్ట్రార్ దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం.
ఆ రెండు కీలక పదవుల్లో ఎవరో!
కాకతీయ యూనివర్సిటీ సీడీసీ డీన్, దూరవిద్యకేంద్రం డైరెక్టర్, విద్యా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, సైకాలజీ విభాగం అధిపతిగా కొనసాగుతున్న ప్రొఫెసర్ వి.రాంచంద్రం రిజిస్ట్రార్‌గా నియామకమయ్యారు. దీంతో సీడీసీ డీన్ పదవి కోసం ఫార్మసీ కళాశాల డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, ఎకనామిక్స్ విభాగం అధిపతి, బోర్డుఆఫ్ స్టడీస్ చైర్మన్, కేయూ పాలకమండలి సభ్యులుగా ఉన్న బి.సురేష్‌లాల్ ఆశిస్తున్నారని సమాచారం. ఆ ఇద్దరిలో ఎవరిని ఆ పదవిలో నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌గా కూడా మరో ప్రొఫెసర్‌ను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, జూవాలజీ విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య పేర్లు వినబడుతున్నాయి. వీరిలో ఒకరిని దూరవిద్యకేంద్రం డైరెక్టర్‌గా నియమించొచ్చని తెలుస్తోంది.
ముగిసిన ప్రొఫెసర్ వెంకయ్య
పదవీకాలం
సీడీసీడీన్, ఎస్‌డీఎల్‌సీఈ
డైరెక్టర్‌గా ఎవరో..!
Comments
Please login to add a commentAdd a comment