పెండ్యాల, హసన్‌పర్తి రైల్వే స్టేషన్లకు వై కేటగిరీ హెచ్
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధి పెండ్యాల, హసన్‌పర్తి రైల్వేస్టేషన్లకు వై కేటగిరీ హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్‌ఆర్‌ఎ) ఇచ్చేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ ఆదివారం తెలిపారు. ఆయా రైల్వే స్టేషన్లకు వై కేటగిరీ హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలని జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు బచ్చలి శ్రీనివాస్, డివిజన్ సెక్రటరీ రవీందర్ మజ్దూర్ యూనియన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో యూనియన్ జనరల్ సెక్రటరీ సీహెచ్.శంకర్‌రావు, ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్ కృషి ఫలితంగా రైల్వే బోర్డు ఆమోదించిందని రవీందర్ తెలిపారు. 2010 నుంచి మజ్దూర్ యూనియన్ జోనల్ కమిటీ సభ్యుడు, జమ్మికుంట బ్రాంచ్ నాయకుడు బచ్చలి శ్రీనివాస్ పోరాట ఫలితంగా రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
తప్పిపోయిన
బాలుడి అప్పగింత
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగశాయిపేట రహదారిపై తప్పిపోయిన ఓ మూడేళ్ల బాలుడు ఏడుస్తూ స్థానికుల కంటపడ్డాడు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కోసం వారు ప్రయత్నించినా లభించలేదు. దీంతో మిల్స్‌కాలనీ పోలీసులకు బాబును అప్పగించగా, పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో రంగశాయిపేట మహంకాళి దేవాలయం సమీపంలో బాలుడి తల్లిదండ్రులు ముత్యాల యాకయ్య, శ్రావణి ఉన్నట్లు గుర్తించి బాలుడిని కానిస్టేబుల్ కుతుబ్ సురక్షితంగా అప్పగించారు. మధ్యాహ్నం రోడ్డుపై చేరిన బాలుడు తప్పిపోయాడు. అప్పుడే పనికివెళ్లి సాయంత్రం 6గంటలకు ఇంటికి చేరిన తల్లి శ్రావణికి బాబు కనిపించలేదు. రోడ్డుపై వెతుకుతున్న క్రమంలో పోలీసులకు బాలుడి తల్లి శ్రావణ తారసపడగా అప్పగించారు.
యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
వరంగల్ క్రైం: ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి హనుమకొండకు వచ్చిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం నర్సంపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి శనివారం ఇంట్లో గొడవపడి హనుమకొండకు వచ్చింది. హయగ్రీవాచారి మైదానంలోని ఎగ్జిబిషన్ వద్ద ఆమెను ఓ ఆటో డ్రైవర్ నమ్మించి బస్టాండ్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment