![నేషనల్ జర్నల్ ఆవిష్కరణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11wgl285-330090_mr-1739332266-0.jpg.webp?itok=wPpDghAn)
నేషనల్ జర్నల్ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో హిస్టరీ విభాగం రూపొందించిన యూజీసీ కేర్ జర్నల్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ‘సొసైటీ ఎకానమీ కల్చర్ ఇన్ తెలంగాణ ట్వెల్త్ టు ట్వెంటీయత్ సెంచరీస్’ అంశంపై ఇటీవల కళాశాలలో నిర్వహించిన హిస్టరీ విభాగం జాతీయ సదస్సు కోసం వివిధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు రాసిన పరిశోధన పత్రాలతో కూడిన వాటిని యూజీసీ కేర్ జర్నల్‌గా రూపొందించారని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, హిస్టరీ విభాగాధిపతి డాక్టర్ కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ప్రిన్సిపాల్ చంద్రమౌళి పింగిళి ప్రభుత్వ కళాశాల గురించి పలు విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాక్ ఏగ్రేడ్ కలిగి ఉన్న కళాశాల అని తెలిపారు. న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించేలా అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ప్రావీణ్య తెలియజేసినట్లు చంద్రమౌళి వివరించారు. కార్యక్రమంలో ఆ కళాశాల ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, అధ్యాపకులు శ్రీనివాస్, సామ్యూల్ ప్రవీణ్‌కుమార్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment