అత్యాశకు పోతే అసలుకే ఎసరు | - | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2023 6:38 AM | Last Updated on Fri, Mar 3 2023 6:38 AM

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న  బాధితులు  
 - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

యాచారం: ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వలలో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు. అధిక వడ్డీ వస్తుందని అత్యాశకు పోయి నిండా మునిగారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. రూ.35 కోట్లకు పైగా మోసపోయామని 50 మంది బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఈ–స్టోర్‌ ఇండియా, కేపీడబ్ల్యూ కంపౌండ్‌ అనే ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ నిర్వహిస్తున్నాయి. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.9 వేల చొప్పున 36 నెలల పాటు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థలు మొదట రూ.లక్ష డిపాజిట్‌ చేసిన వారికి ఆరు నెలల పాటు నెలకు రూ.9 వేల చొప్పున జమ చేసి నమ్మకం సంపాదించుకున్నాయి. దీంతో అత్యాశకు పోయి జనం ఎగబడ్డారు. ఢిల్లీ కేంద్రంగా జరిగే ఈ కంపెనీ వ్యవహారాలను యాచారం గ్రామానికి చెందిన ఎండీ సోఫియాన్‌, ఎండీ ఉమ్నాన్‌, ఎండీ ఫర్‌హాన్‌, మహేశ్వరం గ్రామానికి చెందిన ఎండీ సమద్‌, మొగిలిగిద్దకు చెందిన ఎండీ యూసుఫ్‌, హైదరాబాద్‌కు చెందిన ఎండీ అజహర్‌ పర్యవేక్షించేవారు. జిల్లాలోని యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది వీరి మాటలు నమ్మి ఆయా సంస్థల ఖాతాల్లో రూ. లక్షలు డిపాజిట్‌ చేశారు. అప్పులు చేసి, బంగారు నగలు తాకట్టు పెట్టి, బ్యాంకు ఏడు నెలలుగా వీరి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

సార్‌.. మీరే ఆదుకోండి

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో డబ్బులు జమ చేసి మోసపోయిన బాధితులు గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 50 మందికి పైగా బాధితులు తాము ఆన్‌లైన్‌లో చెల్లించిన డిపాజిట్‌ పత్రాలను సీఐ లింగయ్యకు చూపించారు. ఒక్క యాచారం మండలంలోనే రూ.10 కోట్లకు పైగా డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది. పిల్లల పెళ్లిళ్లకు అవసరం వస్తాయనే ఆశతో రూ.లక్షలు జమ చేశామని, మీరు ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

బాధితుల్లో ఉద్యోగులు సైతం

అధిక వడ్డీ ఆశతో పలు శాఖల ఉద్యోగులు సైతం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, ఆర్టీసీ ఉద్యోగులు వీరిలో ఉన్నారు. కొందరు ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు చెల్లించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.

రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే మూడేళ్లు

నెలకు రూ.9 వేలు జమ చేస్తామని నమ్మబలికిన సంస్థలు

అధిక వడ్డీ ఆశతో జిల్లాలో రూ.35 కోట్లకు పైగా డిపాజిట్‌

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం..

No comments yet. Be the first to comment!
Add a comment
ఈ–స్టోర్‌ ఇండియా కంపెనీ ఇదే 1
1/1

ఈ–స్టోర్‌ ఇండియా కంపెనీ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement