![డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/4/03chm55-160017_mr.jpg.webp?itok=JtQEHSdZ)
డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో బుధవారం అంతర్జాతీయ చిరుత పులి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైల్డ్‌లైఫ్ ఎడ్యూకేషన్ ప్రొగ్రామ్‌లో భాగంగా జాతుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి, అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవాన్ని నిర్వహించారు. సందర్శకులకు బయోస్కోప్ హల్‌లో చిరుతపులిపై లఘు డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. జూ విజిటింగ్‌లో పిల్లతో నిర్వహించిన పిల్లల డ్రాయింగ్ పోటీల్లో మరింత అవగాహన కల్పించడానికి సుమారు 120 మంది పిల్లలు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జూపార్కు క్యూరేటర్ ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ... పర్యావరణాన్ని సంరక్షించడంలో, సమతుల్యం చేయడంలో ప్రతి జాతి దాని స్వంత పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం మే 3న అంతర్జాతీయ చిరుతపులి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment