![ఉత్సవాలను ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళిసై - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/11/10sec103-160061_mr_0.jpg.webp?itok=bs0_wfaT)
ఉత్సవాలను ప్రారంభిస్తున్న గవర్నర్ తమిళిసై
ఉస్మానియా యూనివర్సిటీ: యువత చిన్న సమస్యలపై అతిగా బాధపడకుండా, సమస్యలను అవకాశాలుగా మలచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో బుధవారం ఆమె జి–20 సమ్మిట్‌లో భాగంగా చేపట్టిన ‘వై–20’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొ.సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment