హైదరాబాద్: భూతగాదాలు, పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 7.20 గంటల ప్రాంతంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి ఆర్టీసీ కాలనీ టీపీఎస్ కాలనీలో జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి వివరాల మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఔరంగపూర్‌కు చెందిన ఆశప్ప అలియాస్ అశోక్(50) రాంపల్లిలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
గురువారం రాత్రి అశోక్ తన ఇంటి ముందు కుర్చీలో కూర్చొని ఉండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు నంబర్ ప్లేట్‌లేని కారులో వచ్చి ఇనుపరాడ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చుట్టుపక్కల జనం కేకలు వేయడంతో దాడికి పాల్పడిన దుండగులు కారులో పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ అశోక్‌కుమార్‌ను కుటుంబసభ్యులు, స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మల్కాజ్‌గిరి డీసీపీ జానకీ, ఏసీపీ వెంకట్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడిపై 2019లో కూడా దాడి జరిగిందని, భూ సంబంధ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. గతంలో దాడిచేసిన నారాయణపేట్‌కు చెందిన ఆంజనేయులు, విజయ్‌కుమార్‌గా అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజులుగా కాలనీలో నిందితులు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించినట్లు త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment