ధ్యాన మహా యాగానికి భారీ ఏర్పాట్లు
కడ్తాల్: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేపట్టే పత్రీజీ ధ్యాన మహాయాగ వేడుకలకు మహేశ్వర మహా పిరమిడ్ ముస్తాబయ్యింది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 31 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ధ్యాన మహాయాగానికి ది హైదరాబాద్ స్పిరుచ్యువల్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ధ్యానులకు వసతి గృహాలు, కుటీరాలు
12 ఏళ్లుగా డిసెంబర్ నెలలో వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు అంతా ఇక్కడికి తరలి వచ్చి ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగంలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వేలాది మంది ధ్యానుల మధ్య పత్రీజీ ధ్యాన మహాయాగాలను వైభవంగా నిర్వహించేందుకు ది పిరమిడ్ ట్రస్ట్ స్పిరుచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టింది. ధ్యానులకు ప్రత్యేక వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పించనున్నా రు. ఉచిత అన్నదాన కేంద్రం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం శాశ్వత గదులతో పాటు, తాత్కాలిక వసతి గృహలు, కుటీరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేక అలంకరణతో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. పత్రీజీ ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతి రోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తల, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
21న ప్రారంభం కానున్న ధ్యాన మహా సభలు
12 ఏళ్లుగా 11 రోజుల పాటు నిర్వహణ
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి ధ్యానుల రాక
కార్యక్రమ వివరాలు
ఉదయం 5గంటల నుంచి 8.30గంటల వరకు పత్రీజీ వీడియో సందేశాలు, సామూహిక
వేణుగాణ ధ్యానం, అఖండ ధ్యానం
ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురుసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సంగీత ధ్యానం
Comments
Please login to add a commentAdd a comment