మద్యం మత్తులో పోలీసు వాహనంపై మహిళ దాడి
రాంగోపాల్‌పేట్: మద్యం మత్తులో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి హంగామా చేయడమేగా పోలీసు వాహనంపై రాయితో దాడి చేసిన సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో స్టేషన్‌కు వచ్చిన ఓ జంట ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే వారు మద్యం మత్తులో దురుసుగా మాట్లాడుతుండటంతో పోలీసులు వారిని బయటికి పంపారు. దీంతో సదరు మహిళ మా ఫిర్యాదునే తీసుకోవా.? అంటూ పోలీసులపై తిరగబడింది. అంతటితో ఆగకుండా స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పోలీసు వాహనంపై రాయితో దాడి చేసి అద్దాలు పగులగొట్టింది. స్టేషన్ లోపలికి వెళ్లి ఉన్నతాధికారులపై కూడా దాడికి యత్నించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment