సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
అమీర్‌పేట: ప్రైవేట్ హాస్టళ్లను టార్గెట్ చేసుకుని సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న బావ, బామ్మర్ధులను అరెస్ట్ చేసిన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వారి నుంచి రూ.10 లక్షల విలువైన 51 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్‌తో కలిసి గురువారం వివరాలు వెళ్లడించారు. నేపాల్‌కు చెందిన గోవింద్ బండారి, హిక్‌మత్ రావల్ గత కొన్నేళ్లుగా నగరంలో నివాసముంటున్నారు. గోవింద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండగా, రావల్ రాణీగంజ్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. బావ,బామ్మర్దులైన వీరు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సెల్‌ఫోన్ చోరీలను ఎంచుకున్నారు. తెల్లవారుజామున ప్రైవేట్ హాస్టళ్లలోకి ప్రవేశించి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లేవారు. వాటిని నేపాల్ తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై 22 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి నుంచి 51 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment