ప్రయోగాలు చేయాలి
సాంకేతిక విద్యతో
వెంగళరావునగర్ : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యను జోడిస్తూ యునానీ ఔషధాల తయారీలో ప్రయోగాలు చేపట్టాలని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ యునానీ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ (న్యూఢిల్లీ) డాక్టర్ ఎన్.జహీర్ అహ్మద్ అన్నారు. ఎర్రగడ్డ యునానీ కేంద్రీయ విద్యాలయంలో పరిశోధనలపై మూడురోజుల వర్క్‌షాప్‌ను గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్కిన్ డిజాస్టర్ రోగులకు అందించే మందులను ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు, మారుతున్న వైద్య విధానాలకు అనుగుణంగా రూపొందించాలన్నారు. రీసెర్చ్ మెథడాలజీతో సహా ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, సిద్ధకు చెందిన పీజీ విద్యార్థులకు ఉత్తమ బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక యునానీ కేంద్రీయ వైద్య కళాశాల ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ యూనిస్ ఇఫ్తికార్, మున్షీ, డాక్టర్ వసీం అహ్మద్ (యుపీ), పహ్మిదా జీనత్, డాక్టర్ ఐషా అంజుమ్ తదితర సీనియర్ వైద్యులతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యునానీ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment