భార్యే చంపేసింది..
మైలార్‌దేవ్‌పల్లి: గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. తన సోదరితో కలిసి మృతుడి భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం నిందితులను అరెస్ట్ చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నరేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గానగర్ చౌరస్తా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వెళ్లే దారిలో హ్యాపీ వైన్స్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా వెళ్లిన పోలీసులు సంచిలో కుల్లిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పారవేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ నెల 21న తెల్లవారుజామున ఇద్దరు మహిళలు మృతదేహంతో ఉన్న సంచిని తీసుకువచ్చి డ్రైనేజీలో పారవేసినట్లు వెల్లడైంది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.
నవారుతో ఉరి వేసి..
బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ముంతాజ్ ఆలం(40), రౌషన్ ఖాతున్ దంపతులు నగరానికి వలస వచ్చి ఉడ్డెంగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ముంతాజ్ ఆలం అదే ప్రాంతంలోని చికెన్ సెంటర్‌లో పని చేసేవాడు. మద్యానికి బానిసైన అతను తరచూ భార్యతో గొడవపడటమేగాక ఆమెను కొట్టేవాడు. ఈ విషయాన్ని ఆమె తన సోదరి అక్క రవీనా బీబీకి చెప్పింది. ఈ నెల 20న మద్యం తాగి ఇంటికి వచ్చిన ముంతాజ్ ఆలం నిద్ర పోతుండగా రౌషన్ ఖాతున్, రవినా బీబీ నవారు తాడుతో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నవారు తాడుతో కాళ్లు, చేతులు కట్టి సంచిలో కుక్కి 21న తెల్లవారుజామున లక్ష్మిగూడ చౌరస్తాకు చేరుకున్నారు. ప్యాసింజర్ ఆటోలో ఎక్కి దుర్గానగర్ చౌరస్తా నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే దారిలో దిగిన వారు డ్రైనేజీలో సంచిని పారవేసి వెళ్లిపోయారన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
గుర్తు తెలియని మృతదేహం కేసులో వీడిన మిస్టరీ
వేధింపులు తాళలేక సోదరితో కలిసి మృతుడి భార్య ఘాతుకం
Comments
Please login to add a commentAdd a comment