సందడిగా ధ్యాన మహాయాగం
కడ్తాల్: మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు సందడిగా సాగుతున్నాయి. గురువారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ధ్యాన గురువు పరిణిత పత్రీ మాట్లాడుతూ.. శాఖాహార జగత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇతర జీవులపై ప్రేమ, కరుణతో మెలగాలని సూచించారు. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవాలన్నారు. ధ్యానం ద్వారా పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించకపోతే ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు. అనంతరం ధ్యాన పుస్తకాలను ఆవిష్కరించారు. గ్లోబల్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ తన ధ్యాన అనుభవాలను వివరించారు. ధ్యాన వేదికపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment