రెండు ఆటోలను ఢీకొట్టిన కారు
ఇబ్రహీంపట్నం: అతివేగంగా వస్తున్న కారు రెండు ఆటోలను ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఇబ్రహీంపట్నం నుంచి గుమ్మడవెల్లికి వెళ్తున్న కారు గురునానక్ కాలేజ్ సమీపంలో ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టింది. మొదట ఢీకొట్టిన ఆటో మాడ్గుల మండలం ఫకిర్ తండా నుంచి వస్తోంది. అందులో ప్రయాణిస్తున్న కిషన్, బుజ్జి, నిరోషాకు గాయాలయ్యాయి. మీర్‌పేట్ జిల్లాలగూడలో నివసించే ఐదుగురు కూలీలను తీసుకొని కుర్మేండ్‌లో నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా రెండో ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలోని వెంకటరతమ్మ, శ్రీనుకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను నగరంలోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఐదుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment