సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ ప్రాజెక్టు కొత్త సంవత్సరం 2025లో పట్టాలెక్కనుంది. కేంద్రం నుంచి అనుమతులు లభించిన వెంటనే రెండోదశ పనులు చేపట్టేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్ లిమిటెడ్ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్ల రూట్‌లో భూసేకరణ పనులను ప్రారంభించారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు చర్య లు చేపట్టారు. జనవరి నెలాఖరు నాటికి ఈ పను లను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టులో నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, హయత్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట్ తదితర 5 కారిడార్‌లలో మెట్రోరైల్ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆరో కారిడార్‌గా ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌సిటీ వరకు మరో మార్గం నిర్మించనున్నారు. 2028 నాటికి రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేయా లని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. జైకా, ఏడీబీ వంటి బ్యాంకు లు, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలను సేకరించనున్నారు. మొత్తం 76.4 కిలోమీటర్ల మార్గానికి సుమారు రూ.24,269 కోట్లతో అంచనాలు రూ పొందించారు.
Comments
Please login to add a commentAdd a comment