రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు బాడీవార్న్ కెమెరాలు
సాక్షి, సిటీబ్యూరో: క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ప్రవర్తనతో పాటు వారితో ప్రజల వ్యవహారశైలిని పర్యవేక్షించడానికి, రోడ్డు ప్రమాదాలు తదితరాలు జరిగినప్పుడు అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఉపకరించే బాడీ వార్న్ కెమెరాలను రాచకొండ పోలీసులూ అమలులోకి తీసుకువచ్చారు. తొలి దఫా 50 కెమెరాలు ఖరీదు చేసిన పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు సోమవారం కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో వీటిని అధికారులకు అందించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ ఫీడ్ చూడటంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్న వాహనచోదకుల ప్రవర్తననూ వీటి ద్వారా రికార్డు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment