మహా నగరం.. మంగళవారం ఎటుచూసినా జోరుగా హుషారుగా కనిపించింది. 2024కు వీడ్కోలు చెబుతూ.. 2025కు సిటీ స్వాగతం పలికింది. ఐటీ కారిడార్‌లో నయా సాల్ జోష్ హోరెత్తింది. డీజేలు, రాక్ బ్యాండ్స్, తళుక్కుమన్న టాలీవుడ్ తారలు న్యూ ఇయర్‌కు వెల్‌కం చెప్పారు. గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో కార్తీక్ మ్యూజిక్‌తో సంగీత ప్రియులు సేదతీరారు. హైటెక్ ఎరేనాలో న్యూ ఇయర్ బాష్–2025, కొండాపూర్ హార్ట్ కప్‌లో వన్ నైట్–2025, ప్రిజమ్ క్లబ్ అండ్‌కిచెన్‌లో రామిర్యాల, డీజే షాడో దుబాయ్, రవిష్ కేక పుట్టించారు. రాయదుర్గంలోని డీఈ–7 బార్‌లో వింటేజ్ న్యూఇయర్ పార్టీలో డీజే తనూ ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఎన్‌వైఈ–2025 పేరిట నటి శ్రీలీల, డీజే వినీష్ యువతను మత్తెక్కించారు. హైటెక్స్‌లో డీజే అమల్ మాలిక్, డీసే అసీఫ్ ఇక్భాల్, ఆకాంక్షలు హోరెత్తించిన సంగీతంలో యువత తడిసి ముద్దయ్యారు.
– గచ్చిబౌలి
జూబ్లీహిల్స్ క్లబ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment