మాట్లాడుతున్న అర్వింద్
మెట్‌పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయకుండా నిజాయితీగా వ్యవహరించి సత్తా చూపించా మని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పట్టణంలో ఆదివారం నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశాయని, బీజేపీ వాటికి దూరంగా ఉండి 61వేలకు పైగా ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8స్థానాలు గెలుచుకున్నామని, మరో 18 చోట్ల రెండోస్థానంలో నిలిచామని, రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగిందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఓటమిపై కార్యకర్తలు ఆందోళన చెందొద్దన్నారు. రానున్న పార్లమెంట్, స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ధర్మపురి ఫౌండేషన్ ద్వారా పలువురు కార్యకర్తల కుటుంబాలకు ఎంపీ ఆర్థిక సహాయం అందజేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్, పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment