నగదు పురస్కారంతో శుభశ్రీ సాహు
కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న శుభశ్రీ సాహు శాసీ్త్రయ ఆవిష్కరణలో భాగంగా ఓఎల్‌ఎల్ సీఎన్‌ఎన్ టీవీ 18 స్కిల్ టైటాన్స్–23 ఇటీవల ముంబైలో నిర్వహించిన స్కిల్ టైటాన్ గ్రాండ్ ఫినాలెలో మూడో స్థానంలో నిలిచి రూ.2లక్షల నగదు బహుమతి గెలుచుకున్నట్లు పాఠశాల హెచ్‌ఎం రితేష్ మెహతా తెలిపారు. ప్రధాని ఆర్థిక శాస్త్ర సలహా మండలి కన్సల్టెంట్ అపూర్వశర్మ చేతుల మీదుగా నగదు బహుమతి గెలుచుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. శుభశ్రీ తన గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు నేతృత్వంలో పర్యావరణ అనుకూలమైన, మల్టిఫంక్షనల్, తక్కువ ధర, పోర్టబుల్ వ్యవసాయ యంత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఈ యంత్రం నూర్పిడి, ధాన్యాన్ని వేరు చేయడం, గడ్డిని కత్తిరించడం, వినోవింగ్, బ్యాగ్ కుట్టడం వంటి నాలుగు వేర్వేరు కార్యకలాపాలతో పని చేస్తుందన్నారు. సౌర శక్తితో పని చేసే ఈ యంత్రానికి విద్యుత్ వినియోగం తగ్గనుందని చెప్పారు. పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌రావు, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, వినోద్‌రావు, హన్మంతరావు, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ విద్యార్థిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment