నిజామాబాద్‌ లోక్‌సభకు 12 నామినేషన్లు | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ లోక్‌సభకు 12 నామినేషన్లు

Published Tue, Apr 23 2024 8:25 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌, బహుజన్‌ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్‌ మూడోసెట్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి కండెల సుమన్‌, స్వతంత్ర అభ్యర్థి ఆర్‌.రాజేందర్‌, రాపెల్లి శ్రీనివాస్‌, స్వతంత్ర అభ్యర్థి సయ్యద్‌ అస్గర్‌ రెండోసెట్‌ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు.

నాలుగోరోజు.. 14మంది నామినేషన్‌

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు వారు తమ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య,, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్‌, జుమ్మిడి గోపాల్‌, అంబాల మహేందర్‌, జనగామ నరేశ్‌, ముల్కల్ల రాజేంద్రప్రసాద్‌, దాగం సుధారాణి, జాడి ప్రేమ్‌సాగర్‌, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్‌ నామినేషన్‌ పత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్‌కుమార్‌, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25 మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్‌ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

గల్ఫ్‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం

కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే గల్ఫ్‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెలిపారు. రైతులను బీఆర్‌ఎస్‌, బీజేపీ పట్టించుకోలేదని, పసుపుబోర్డుపై అర్వింద్‌ ఉత్తర్వులతో సరిపెట్టారని పేర్కొన్నారు. గల్ఫ్‌ కార్మికులు మృతిచెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. పసుపుబోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తారా..? లేక అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేస్తారా..? స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్‌, బీజేపీపై ఉందన్నారు. నిజామాబాద్‌కు స్మార్ట్‌సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement