ఎములాడ రాజన్నకు మొక్కులు
వేములవాడ: ఎములాడ రాజన్నను బుధవారం సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాల్లో పూజలు చేశారు. ఏర్పాట్లను ఈవో వినోద్‌రెడ్డి పర్యవేక్షించారు.
ఘనంగా మహారుద్ర యాగం
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ రాజన్న ఆలయంలో బుధవారం స్వామివారికి మహారుద్ర యాగం, చండీహోమం, కోడె పూజ, రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈవో వినోద్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవస్థానంలో రూ.123 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.కోటితో బద్దిపోచమ్మ ఆలయ పునఃనిర్మాణం, రూ.25 లక్షలతో నాంపల్లి గుట్ట సమీపంలోని దేవస్థానం భూమికి ప్రహరీ నిర్మాణం, రూ.71 లక్షలతో తిప్పాపూర్ గోశాలలో సీసీరోడ్డు, మురికి కాలువ, మొరం పోయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. రూ.35 లక్షలతో గోశాలలో షెడ్లు, విద్యుత్ సౌకర్యం, కోడెల కోసం క్వారంటైన్ షెడ్డు, రూ.50 లక్షలతో జాతర గ్రౌండ్‌లోని గోశాలలో రెండు షెడ్లు, రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ, రూ.35 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అన్నదాన కేంద్రం, భక్తులకు బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment