6 అబద్ధాలు.. 66 మోసాలు
● గ్యారంటీల గారడీతో ప్రజలకు కాంగ్రెస్ కుచ్చుటోపీ ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఆరు అబద్ధాలు.. 66 మోసాలుగా సాగిందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మార్పు పేరిట కాంగ్రెస్ చెప్పిన అందమైన అబద్ధాలను నమ్మి ఓట్లేసి రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు గోసపడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన యావర్‌రోడ్, డబుల్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ముందుకు సాగడం లేదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే నాయకుడు.. జగిత్యాల అభివృద్ది పేరిట దొంగచాటుగా కాంగ్రెస్‌లో చేరిన మరో నాయకుడు జగిత్యాలకు చేసింది శూన్యమన్నారు. యువవికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఏమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రాష్ట్రం మరింత అప్పుల కుప్పగా మారిందన్నారు. నాయకులు రంగు గోపాల్, నలువాల తిరుపతి, ఆముద రాజు, మ్యాదరి అశోక్, సిరికొండ రాజన్న, దూరిశెట్టి మమత, చెన్నాడి మధురిమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment