కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఈనెల 1న ఆత్మహత్య చేసుకోగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గోదావరిఖని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో నివాసముండే కొరకండ్ల మల్లారెడ్డి(50) సెంటనరీకాలనీలోని ఓ రెస్టారెంట్‌లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఈనెల 1న ఇంట్లో భార్య రజితతో గొడవ జరుగగా, కోపంతో మల్లారెడ్డి ఇంట్లోని టీవీ పగలగొట్టి ద్విచక్ర వాహనంపై సెంటినరీకాలనీలోని తాను పని చేసే రెస్టారెంట్‌కు వెళ్లాడు. రాత్రి 10 గంటలకు విధులు ముగించుకొని రెస్టారెంట్ కౌంటర్ వద్ద తన పర్స్, ఫోన్, ఉంగరం పెట్టి బయలుదేరాడు. మార్గమధ్యలో పెట్రోల్ బంకులో క్యాన్‌లో పెట్రోల్ తీసుకొని రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్, గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం డంప్‌యార్డ్‌లో నిర్మానుష ప్రదేశానికి వెళ్లి తన ద్విచక్రవాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను నిప్పంటించుకొని మృతిచెంది ఉంటారని మృతుడి కుమార్తె కొరకండ్ల సాహితిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రామగిరి ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment