వేములవాడ: వేములవాడ ఆలయంలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన డి.శేఖర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన మహిళా హోంగార్డు వడ్ల అనూషను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. వివరాలు.. కొద్ది రోజుల క్రితం సదరు హోంగార్డు తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద రూ.3.50 లక్షలు అప్పు తీసుకుంది. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని ఇవ్వలేదు. డబ్బులు అడిగితే.. తనను శేఖర్ పెళ్లి చేసుకున్నాడని తప్పుడు పెళ్లి పత్రిక, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తూ రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, పరువు పోతుందని భయపడిన శేఖర్ రూ.5 లక్షలు అనూషకు ఇచ్చాడు. మళ్లీ రూ.2 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో విసిగిపోయిన శేఖర్ వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి అనూషపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా ఇలాగే బ్లాక్‌మెయిల్ చేస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
నలుగురికి రిమాండ్
సిరిసిల్ల క్రైం: పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్న నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. పోలీసుల వివరణ ప్రకారం... పట్టణంలోని గాంధీచౌక్ ఎస్‌ఆర్‌కే వైన్స్ వద్ద కొల్లమద్ది భానుప్రసాద్ మద్యం కొనేందుకు వెళ్లగా సంజీవయ్య నగర్‌కు చెందిన అలువాల ప్రశాంత్, రాకమ్ భరత్, కొండ శేఖర్, తుడిచెర్ల నిఖిల్ అతడిపై దాడిచేసి రూ.8 వేలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 2న ఫిర్యాదు కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు ఆధారంగా వారిని గుర్తించారు. వారినుంచి రూ.2వేలతోపాటు 4 సెల్‌ఫోన్లను సీజ్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment