వైజ్ఞానిక ప్రదర్శనలకు వేళాయే
జగిత్యాల: వైజ్ఞానిక ప్రదర్శనలకు జిల్లా ముస్తాబవుతోంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాస్థాయి ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్‌స్పైర్ అవార్డ్స్ మానక్)తో పాటు, బాలవైజ్ఞానిక ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి.
రెండు రకాల్లో పోటీలు
రెండు రకాల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు జరుగనున్నాయి. 6 నుంచి 10వ తరగతి చదివే బాలబాలికలు పోటీపడనున్నారు. ప్రతిభ ఆధారంగా మొత్తం ప్రదర్శనలో 10 శాతం నమూనాలను రాష్ట్రస్థాయికి పంపనున్నారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటితే జాతీ యస్థాయిలో రాష్ట్రపతి భవనానికి కూడా వెళ్లవచ్చు.
బాలవైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధాన అంశం
సుస్థిర అభివృద్ధిలో సాంకేతిక పాత్ర, ఏడు ఉప అంశాలు ఉంటాయి. ప్రతి ఉప అంశంలో సీనియర్, జూనియర్ విభాగాల్లో ఒక ప్రాజెక్ట్ చొప్పున మొత్తం 14 నమూనాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి ప్రదర్శనలకు ఎంపికై న విద్యార్థులకు భవిష్యత్‌లో ఉన్నత సాంకేతిక శాస్త్ర సంస్థల్లో నిర్దేశిత కోర్సులు అభ్యసించేందుకు రిజర్వేషన్లు సైతం వర్తిస్తాయి. ఇది భావిశాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి.
జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్
ఈనెల 6, 7 తేదీల్లో జగిత్యాలలోని ఓల్డ్ హైస్కూల్‌లో సైన్స్‌ఫేర్ జరుగనుంది. విద్యార్థులు వారి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలను వ్రైట్ యూపీఎస్ రెండు సెట్లు తయారుచేసుకుని ఒక సెట్ మొదటి రోజు 6న రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో సెట్ విద్యార్థి వద్దే ఉంచుకోవాలి. అనంతరం జ్యూరీ మెంబర్స్‌కు చూపించాల్సి ఉంటుంది.
ప్రతిఒక్కరూ పాల్గొనాలి
సైన్స్‌ఫేర్‌లో ప్రతిఒక్క విద్యార్థి పాల్గొనాలి. ఒక బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఒక పాఠశాల నుంచి ఒక గైడ్ మా త్రమే రావాలి. సెలెక్ట్ అయిన ఇన్‌స్పైర్ అవార్డ్స్ విద్యార్థులు తప్పకుండా ఎగ్జిబిట్స్‌తో హాజరుకావాలి. – రాము, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment