జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోతుండటంతో చలితీవ్రత పెరుగుతోంది. శనివారం ఉదయం 8.30 గంటల వరకు మల్లాపూర్ మండల కేంద్రంలో 10.3, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 10.6, మెట్‌పల్లి మండల కేంద్రంలో 10.8, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 10.8, సారంగాపూర్‌లో 11.0, కోరుట్లలో 11.0, ఎండపల్లి మండలం గుల్లకోటలో 11.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 11 నుంచి 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేడు కవిత రాక
జగిత్యాల: ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. ధరూర్‌లోని ఎ స్సారెస్పీ కెనాల్ వద్దను న్న అంబేడ్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ ద్వారా ధరూర్ నుంచి న్యూబస్టాండ్‌లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తిరిగి వెళ్లిపోనున్నారు.
బీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేయాలి
జగిత్యాల: బీఆర్‌ఎస్ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, జిల్లాలో అన్నివర్గాల వారితో నాయకులు సమన్వయ కమిటీ వేసుకుని పార్టీ పటిష్టతకు పాటుపడాలని కోరారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పే ర్కొన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో వెల్లడయిందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, సతీశ్, ఆనందరావు, దేవేందర్‌నాయక్, శివకేసరిబాబు, సమిండ్ల వాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక పాల్గొన్నారు.
నిశ్శబ్ద యుద్ధం కవితా సంపుటి ఆవిష్కరణ
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): నిశ్శబ్ద యుద్ధం కవిత సంపుటిని శనివారం సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆవిష్కరించారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెరంబుదూర్ లింబాద్రిస్వామి రచించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు, కళాకారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదిక అని, ఎంతో మంది కళాకారులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు.కార్యక్రమంలో సేనాధిపతి, లక్ష్మ ణాచారి, ఆనందరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలి
జగిత్యాల: ప్రతీ విద్యార్థికి మెనూ చార్జీ రూ.25 అందించాలని, ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. శనివారం తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కార్మికుల బతుకులు మారడం లేదన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, నామమాత్రపు ధరలు ప్రభుత్వం చెల్లిస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికై నా చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు జంపాల రవీందర్, లక్ష్మణ్, ముఖ్రమ్, మహేశ్, భాగ్యలక్ష్మి, పద్మ, సరస్వతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment