నేరమయ జీవితాలతో ప్రశాంతత దూరం
జగిత్యాలఅగ్రికల్చర్: నేరమయ జీవితాలతో ప్రశాంతత దూరం అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ నీలిమ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించి మా ట్లాడారు. రాజీ దృష్టితో ఆలోచిస్తే చాలా సమస్యల కు పరిష్కారం దొరుకుతుందని, ఇరువర్గాలు ప్ర శాంత వాతావరణంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ల ద్వారా చాలా కేసులకు సత్వర పరిష్కారం లభి స్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరిష్కరించారు.
3,266 కేసుల పరిష్కారం
జగిత్యాలజోన్: జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కో రుట్ల, మెట్‌పల్లి కోర్టుల్లో శనివారం జరిగిన జాతీ య లోక్ అదాలత్‌లో 3,266 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో 35 సివిల్, 2,298 క్రిమినల్, 933 ప్రి లిటిగెంట్ కేసులు పరిష్కారమయ్యాయి.
రాజీయే రాజమార్గం
ధర్మపురి: కోర్టు కేసుల్లో ఉన్నవారు రాజీ పడితే కేసులు త్వరగా పరిష్కారమవుతాయని జూనియర్ సివి ల్ జడ్జి శ్యామ్‌ప్రసాద్ అన్నారు. లోక్ అదాలత్‌లో భాగంగా ధర్మపురి కోర్టు పరిధిలో 444 కేసులు పరి ష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు రాజేశ్, గౌరవ అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.
రాజీతో కేసుల పరిష్కారం
మెట్‌పల్లి(కోరుట్ల): కక్షిదారులు రాజీ కుదుర్చుకుంటే లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించవచ్చని సీనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులను పరిష్కరించారు. జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ అరుణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
Comments
Please login to add a commentAdd a comment