గానుగ నూనె
కరీంనగర్/జ్యోతినగర్(రామగుండం): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల్‌నగర్‌లో యువ రైతు మఽ దుసూదన్‌రెడ్డి వేద ఆర్గానిక్స్ పేరిట గానుగ నూనెలు, సేంద్రియ ఆహార ఉ త్పత్తులు విక్రయిస్తున్నా డు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక గానుగ కేంద్రాన్ని, హైదరాబాద్ మెయిన్ రోడ్ పొన్నాల దాబా వద్ద మరొకటి ప్రారంభించాడు. ప్రత్యక్షంగా 15 మందికి, పచ్చళ్లు, మొలకలు, ఇతరత్రా ఉత్పత్తులు తయారు చేయిస్తూ మహిళా గ్రూపుల సభ్యులు మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కళ్లముందే నూనె పట్టి ఇస్తుండటంతో కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పల్లి నూనె రూ.400, నువ్వుల నూనె రూ.600కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో 2020 నుంచి గానుగ నూనె తయారు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండం న్యూపోరట్‌పల్లికి చెందిన రవళిక శ్రీ రాజరాజేశ్వర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ పేరిట గానుగ నూనె తయారు చేస్తోంది. ఇందుకోసం వాడే పరికరాలు రోకలి దుడ్డు, రోలు చెక్కతో చేసినవే కా వడంతో నూనె వేడెక్కకుండా పోషకాలు అలా గే ఉంటాయి. పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసు మ నూనె కావాల్సినవారు 79959 29170 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment