No Headline
సిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన మేర్గు రమాదేవి–సత్యనారా యణ దంపతులు లాభాపేక్ష లేకుండా పది మందికి ఆరో గ్యాన్ని పంచుతున్నారు. తమ గురువుల నుంచి పొందిన ఆరోగ్య పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఏడాదిగా ఇంట్లోనే గుమ్మడి, సొరకాయ, బీట్‌రూట్, కాకరకాయ, క్యారెట్ తదితర జ్యూస్‌లు ఉదయాన్నే తయారు చేసి, విక్రయిస్తున్నారు. రూ.10కే హెల్తీ జ్యూస్ లభిస్తుండటంతో వాకర్స్, యోగా సాధకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కొనుగోలు చేసి, తాగుతున్నారు. గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మేధోశక్తి పెరుగుతుందని, మిగతా కాయలు, పండ్లతో చేసిన రసాలతోనూ చాలా ఉపయోగాలు ఉన్నాయని సత్యనారాయణ తెలిపారు.
హెల్తీ జ్యూస్
Comments
Please login to add a commentAdd a comment