ధాన్యం మొలకలు
జగిత్యాల అగ్రికల్చర్: మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎక్కువ ఉండటంతో ఇటీవల ప్రజల చూపు వాటిపై పడింది. దీంతో, జగిత్యాలకు చెందిన మొగిలి నవీన్ కారు డ్రైవర్‌గా పని చేస్తూనే, ప్రతీరోజు ఉదయం వివిధ రకాల ధాన్యం మొలకలు అమ్ముతున్నాడు. స్థానిక రైతు బజార్ కూరగాయల మార్కెట్, మినిస్టేడియానికి వెళ్లే దారిలో శనగలు, బఠాణీలు, వేరుశనగ, కందులు, పెసలు, బబ్బెర్లు.. తదితరాల మొలకలు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. రోజుకు 6 నుంచి 7 కిలోల వరకు అమ్ముతూ ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నాడు. వాకింగ్‌కు, కూరగాయల కోసం వచ్చేవారు కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment